
లక్నో: ఒక మహిళ గన్తో గాల్లోకి కాల్పులు జరిపింది. ఒక వ్యక్తి దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెపై కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. కొత్వాలి ప్రాంతానికి చెందిన ఒక మహిళ బుధవారం రాత్రి తన పుట్టిన రోజు వేడుక జరుపుకున్నది. ఇందులో భాగంగా ఒక ఇరుకైన వీధిలో నీలం లైట్ల కాంతిలో చేతిలోని తుపాకీతో గాల్లోకి పలుమార్లు కాల్పులు జరిపింది. సోదరుడు ఆమె వెనుక ఉండగా ముందు మరో మహిళ ఉన్నది. కాగా, ఈ కాల్పుల శబ్దానికి స్థానికులు భయాందోళన చెందారు.
మరోవైపు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోను ఒక ట్విట్టర్ యూజర్ ముజఫర్నగర్ పోలీస్ ట్విట్టర్ ఖాతాకు పంపి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేశామని, ఆ మేరకు చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు రీట్వీట్ చేశారు.
— I stand with innocent always, (@MKandhalvi) December 23, 2021