లక్నో : యూపీ రాజధాని లక్నో జనేశ్వర్ మిశ్రా పార్క్ చెరువులో శుక్రవారం 34 ఏండ్ల మహిళ మృతదేహం తేలియాడటం కలకలం రేపింది. గోమతినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకోగా మృతురాలిని ఇంకా గుర్తించలేదు.
చెరువులో మహిళ మృతదేహం కనిపించడంతో సిబ్బంది పార్క్ సూపర్వైజర్లకు తెలపగా వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోలీసులు పోస్ట్‌మార్టం నిర్వహించేందుకు ఆస్పత్రికి తరలించారు.
బాధితురాలిని గుర్తించేందుకు పరిసర ప్రాంతాల సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. కేసును పరిష్కరించేందుకు పార్క్‌లో ఉన్న వారిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. చెరువులోకి దూకి మహిళ ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.