బెంగళూరు గీతం క్యాంపస్‌లో ఉగాండా విద్యార్థిని మృతి..
బెంగళూరు : కర్ణాటకలోని బెంగళూరు రూరల్ జిల్లాలోని గీతం క్యాంపస్‌లో ఉగాండా దేశానికి చెందిన విద్యార్థిని మృతి చెందింది. అయితే ఆమె ఆత్మహత్య చేసుకుందని భావించిన తోటి విద్యార్థులు ఆందోళనకు దిగి, యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో క్యాంపస్‌లో పోలీసులు భారీగా మోహరించారు.
ఉగాండాకు చెందిన హసీనా(24) గీతం యూనివర్సిటీలో ఇంజినీరింగ్ ఫైనలియర్ చదువుతోంది. అయితే ఆరో అంతస్తుపై ఉన్న బట్టలను తీసుకువచ్చేందుకు హసీనా యత్నించగా, ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆమెను ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన బుధవారం రాత్రి 11 గంటల సమయంలో చోటు చేసుకుంది.
అయితే హసీనా ఆత్మహత్య చేసుకుందనే వార్తలు క్యాంపస్‌లో గుప్పుమన్నాయి. దీంతో తోటి విద్యార్థులందరూ ఆందోళనకు దిగారు. కాలేజీ, హాస్టల్ బిల్డింగ్ కిటీకీలను, మంచాలను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో క్యాంపస్‌లో యుద్ధ వాతావరణం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు క్యాంపస్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జి చేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

