Accident | గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు మృతి

శంషాబాద్ రూరల్ : గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు మృతి చెందిన సంఘటన గురువారం శంషాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ ప్రకాశ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
నగరంలోని చంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన ప్రభాకర్ (38), అక్బర్ బీన్ సోమన్ (44) ఇద్దరు కలిసి TS12 ER 9839 నంబర్ గల యాక్టివా వాహనంపై షాద్‌నగర్ నుంచి శంషాబాద్ వైపు వస్తుండగా హైదరాబాద్-బెంగుళూరు జాతీయ రహదారిలో ఘాన్సిమియాగూడ- పెద్దషాపూర్ గ్రామాల మధ్యలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతి చెందిన వారి వివరాలు సేకరించారు. ప్రభాకర్ స్థానికంగా రేషన్ షాపు నడిపిస్తుండగా అక్భర్ బీన్ సోమన్ టైలర్‌షాపు నిర్వహిస్తున్నాడు. మృతదేహాలను పోస్టుమార్ఠం నిమిత్తం నగరంలోని ఉస్మానియా దవాఖానకు తరలించారు.
ద్వీచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తితో పాటు వెనుక కూర్చొన్న వ్యక్తికి హెల్మెట్ లేకపోవడంతోనే తలకు గాయాలై మృతి చెందినట్లు పోలీసులు వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

