
హైదరాబాద్ : నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. ఉప్పునూతల మండలం వెల్టూర్ గేట్ వద్ద ఎదురెదురుగా వచ్చిన రెండు ఢీకొట్టుకున్నాయి. వెల్టూర్ గేట్ వద్ద శ్రీశైలం – హైదరాబాద్ రహదారిపై ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది. బాధితులను అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషమంగా ఉన్న ఇద్దరిని హైదరాబాద్కు తరలించారు. బాధితులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉన్నది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి, పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.