భువనేశ్వర్: పెండ్లి బృందం మీదకు ఒక లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి జాతీయ రహదారి 226 పక్కగా పెండ్లి బృందం ఊరేగింపుగా వెళ్తున్నది. కొందరు డ్యాన్స్ చేస్తున్నారు. ఇంతలో వేగంగా వచ్చిన ఒక లారీ పెండ్లి బృందం మీద నుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. మరణించిన వారిలో వరుడి తండ్రి కూడా ఉన్నారు. నలుగురు గాయపడగా వారి పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం.
కాగా, లారీ డ్రైవర్ మద్యం సేవించి డ్రైవ్ చేస్తున్నట్లు గుర్తించారు. స్థానికులు అతడ్ని చితకబాది పోలీసులకు అప్పగించారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు అక్కడి సీసీటీవీలో రికార్డైన ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.