పరిగి టౌన్ : ట్రాక్టర్ బోల్తాపడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన పరిగి పోలీస్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై విఠల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని గడిసింగాపూర్ గ్రామానికి చెందిన కోట్ల మహేందర్‌రెడ్డి (23) ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి మృతి చెందాడు.
మృతుడికి మామ కోట్ల వెంకట్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విఠల్‌రెడ్డి తెలిపారు.