డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ హరిద్వార్‌లోని పవిత్ర హర్ కి పౌరి ఘాట్ వద్ద హుక్కా పీల్చిన వ్యక్తులపై స్థానికులు దాడి చేశారు. హర్యానా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆరుగురు పర్యాటకులు హరిద్వార్‌కు వచ్చారు. ఈ నెల 7న స్థానిక హర్ కి పౌరి ఘాట్ వద్ద హుక్కా తాగుతూ జోకులు వేసుకుంటూ సందడి చేశారు. గమనించిన స్థానికులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హుక్కాలను లాక్కొని ధ్వంసం చేశారు. ఆరుగురు వ్యక్తులపై దాడి చేసి కొట్టారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు. పవిత్ర పుణ్య క్షేత్రాల్లో మత పరమైన మనోభావాలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదని హెచ్చరించారు. కాగా ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.
No mockery of religious places will be tolerated any further.
— 𝕍𝕠𝕪𝕒𝕘𝕖𝕣™🚩🇮🇳 (@V0YAGERTWEETS) July 8, 2021
On Thursday, some vidharmis of Haryana and Delhi were smoking hookah while taking a bath at Harki Paidi were given some good treatment by devotess & priests, later handed over to the police. pic.twitter.com/X9oONgn1mX