లక్నో : మహిళలపై దగ్గరి వారే నమ్మించి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. లక్నోలో మహిళ పాలిట ఆమె బంధువే రాబందులా మారి అరాచకానికి పాల్పడ్డాడు. మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె ఇంటికి వచ్చిన బంధువు తీవ్రంగా హింసించాడు.
బలవంతంగా ఆమెతో ఫినాయిల్ తాగించేందుకు ప్రయత్నించడంతో పాటు హత్యాయత్నానికి పాల్పడ్డాడు. మార్చి 26 మద్యాహ్నం తాను ఒంటరిగా ఉన్న సమయంలో ఇంటికి వచ్చిన బంధువు తన జుట్టుపట్టుకుని లాగి కిందకు తోసివేశాడని, ఆపై తన దుస్తులను చింపి మొబైల్ ఫోన్లో ఆ దృశ్యాలు రికార్డు చేశాడని మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు.
నిందితుడు తన దుపట్టాను కాల్చేందుకు ప్రయత్నించాడని ఆమె పేర్కొన్నారు. మహిళ ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై లైంగిక వేధింపులు, దాడి సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.