చెన్నై: జొమాటో డెలివరీ వ్యక్తిపై ఒక ట్రాఫిక్ పోలీస్ దాడి చేశాడు. తమిళనాడులోని విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూరులో ఈ ఘటన జరిగింది. జొమాటో డెలివరీ వ్యక్తి వెంకటేశ్, తొలుత ద్విచక్ర వాహనంపై ఉన్న ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ ధర్మరాజ్ యూనిఫార్మ్‌పై చేయివేసి చొక్కా షోల్డర్ పుచ్చుకుని వాగ్వాదానికి దిగాడు. దీంతో ఆగ్రహించిన ట్రాఫిక్ పోలీస్ అధికారి ధర్మరాజ్, వెంకటేశ్‌ను తీవ్రంగా కొట్టాడు. అతడి రెండు చెంపలపై వాయించాడు. అనంతరం జొమాటో డెలివరీ వ్యక్తి వెంకటేశ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అతడు కత్తిని బయటకు తీసి ట్రాఫిక్ పోలీస్ అధికారిని బెదిరించినట్లు ఎఫ్ఐఆర్లో ఆరోపించారు. కాగా, వాహనదారులు తమ మొబైల్లో రికార్డు చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.