Theft | ఇంట్లో దొంగలు పడ్డారు…పోలీసుల విచారణలో తేలిందేంటంటే ..

బండ్లగూడ : కంటి శస్త్ర చికత్స కోసం సొంతూరికి వెళ్లి వచ్చే సరికి ఇంట్లో దొంగలు పడి నగదు,బంగారం ఎత్తుళ్లిన సంఘటనలో రాజేంద్రనగర్ పోలీసులు దొంగను అరెస్టు చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు.ఇన్స్పెక్టర్ కనకయ్య తెలిపిన వివరాల ప్రకారం…రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ సాయిరాం నగర్లో నివాసం ఉండే ఇందిరా గత నెల 27న కంటి చికిత్స కోసం అనంతపురం వెళ్లి తిరిగి బుధవారం సాయంత్రం ఇంటికి వచ్చింది.
అమె ఇంటికి చేరుకునే సరికి ఇంటికి మరొక తాళం వేసి ఉండటంతో అమె అనుమానంతో ఇంట్లోకి వెళ్లి పరిశీలించింది. ఇంట్లో ఉన్న అల్మారాలు తెరిచి ఉండటంతో అమె దొంగతనం జరిగినట్లు గ్రహించి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో లక్షా 30 వేల నగదుతో పాటు బంగారం గోలుసులు పోయినట్లు పిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి ఇంటి వాచ్‌మెన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నిజం ఒప్పుకున్నాడు.దీంతో నిందుతుడు కిరణ్‌కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.అతని నుంచి 81 వేల నగదు,2.2తులల బంగారం స్వాదీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

