న్యూయార్క్ : పబ్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి ఓ వ్యక్తి డ్రింక్స్ తీసుకుంటూ డిన్నర్లో బిజీగా ఉండగా దొంగ చేతివాటం ప్రదర్శించాడు. సదరు వ్యక్తి ఐఫోన్‌ను కొట్టేసిన దొంగ ఆ స్ధానంలో నకిలీ ఫోన్ పెట్టేసి ఉడాయించాడు. తన ఫోన్‌ను చెక్ చేసుకున్న బాధితుడు ముందుగా ఫోన్ బ్యాటరీ చార్జింగ్ అయిపోయిందని భావించాడు. ఆపై తన ఐఫోన్‌ను దొంగిలించిన వ్యక్తి ఫేక్ ఫోన్‌ను అక్కడ ఉంచి పరారయ్యాడని తెలుసుకున్నాడు. బిజినెస్ ఇన్సైడర్ అందించిన వివరాల ప్రకారం న్యూయార్క్‌కు చెందిన ట్రెంట్ ఇటీవల తన ఫ్రెండ్స్‌తో కలిసి డిన్నర్ చేసేందుకు పబ్‌కు వెళ్లాడు.
అక్కడ పార్టీ అనంతరం తన ఫోన్‌ను చెక్ చేసుకోగా ముందుగా బ్యాటరీ అయిపోయిందని భావించాడు. ఇంటికి వెళుతూ దారిలో పిజా అవుట్‌లెట్‌లో చార్జింగ్ పెట్టాలని అక్కడి సిబ్బందిని కోరాడు. కొద్ది గంటల తర్వాత ఆ ఫోన్ తనదికాదని తెలుసుకున్న ట్రెంట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దొంగ తన పాస్‌కోడ్ సాయంతో పాస్వర్డ్ మేనేజర్‌తో యాక్సెస్ పొంది తన క్రెడిట్ కార్డులు, బ్యాంకింగ్ సమాచారాన్ని తెలుసుకున్నాడని ట్రెంట్ వాపోయాడు.
పబ్ పార్టీలో తాను తన పాస్‌కోడ్‌ను చూడటం దొంగ గమనించి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశాడు. ఆపై దొంగ తన ఒరిజినల్ ఐఫోన్‌ను తస్కరించి అదే కేస్‌లో అతడి ఫేక్ ఫోన్‌ను పెట్టి ఉంటాడని ట్రెంట్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దొంగ తన పాస్‌వర్డ్‌లను కూడా మార్చివేశాడని, ఇప్పుడు తన ఐఫోన్‌తో తనకు యాక్సెస్ లేదని చెప్పాడు. తన పేరుతో దొంగ క్రెడిట్ కార్డు ఓపెన్ చేసి ఐప్యాడ్ కొనుగోలు చేశాడని వెన్మో ఖాతాను ఖాళీ చేశాడని తెలిపాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read More :