బ్యాంకులో డ్రైవర్గా పని చేస్తున్న ఒక వ్యక్తి.. తన అప్పులు తీర్చుకోవడం కోసం రూ.17 లక్షలు ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన ముంబైలో జరిగింది. స్థానికంగా ఉన్న ఒక బ్యాంకులో డ్రైవర్గా పనిచేస్తున్న 46 ఏళ్ల వ్యక్తి.. రూ.17 లక్షలు కొట్టేశాడు. ఆ డబ్బుతో పరారైన నిందితుడి కోసం పోలీసులు గాలించగా.. బిహార్ వెళ్లిపోయినట్లు తెలిసింది.
అక్కడకు వెళ్లి ఆ డ్రైవర్ను పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రూ.10 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మిగతా డబ్బుతో తన అప్పులు తీర్చేశానని సదరు వ్యక్తి పోలీసులకు చెప్పాడు. నిందితుడిని కోర్టులో హాజరు పరిచినట్లు పోలీసులు తెలిపారు.