Crime | విద్యార్థిని పట్ల వ్యాయమ ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన

చార్మినార్ : శారీరక ధృడత్వం, మానసిక ఉల్లాసం కోసం విద్యార్థులకు వ్యాయమం నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు . బహదూర్‌పుర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటన సంబంధించి ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్ వివరించారు. పోలీస్‌స్టేషన్ పరిధిలోని మహ్మద్ నగర్ ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేట్ హై స్కూల్లో 45 ఏండ్ల వ్యక్తి వ్యాయమ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు.
కాగా ఇటీవల వ్యాయమం పేరుతో 6వ తరగతి విద్యార్థిని (13) పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అన్యమనష్కంగా ఇంటికి చేరుకున్న బాధితురాలిని కుటుంబ సభ్యులు ఆరా తీశారు. పాఠశాలలో జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే బాధితురాలి తండ్రి పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

