అమీర్‌పేట్ : సంధ్య కన్స్టక్షన్స్ ఎం.డి శ్రీధర్‌రావుపై సనత్‌నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. శ్రీధర్‌రావుకు వ్యక్తిగత జిమ్ ట్రైనర్, బాడీగార్డ్‌గా సనత్‌నగర్ అశోక్‌కాలనీకి చెందిన ఓ వ్యక్తి ఉంటున్నాడు.
ఇదిలా ఉంటే గత నెల 10న రాత్రి బంజారాహిల్స్‌లోని తన నివాసంలో శ్రీధర్‌రావు తనపై అసహజ లైంగిక దాడికి పాల్పడినట్టు బాధితుడు సనత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జరిగిన విషయం ఎవరికీ చెప్పొద్దంటూ తనను బెదిరింపులకు కూడా గురి చేశాడంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఇటీవల పలు కేసుల్లో శ్రీధర్‌రావు పేరు వినిపిస్తున్న పరిస్థితుల్లో ధైర్యం చేసి తాను ఫిర్యాదు చేసేందుకు ముందుకు వచ్చానని బాధితుడు చెబుతుండగా.. ఈ అసహజ లైంగిక దాడి కేసులో ఎటువంటి ప్రాథమిక ఆధారాలు లభ్యం కాలేదని సనత్‌నగర్ ఇన్స్పెక్టర్ ముత్తుయాదవ్ చెబుతున్నారు. బాధితుడు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్టు సనత్‌నగర్ ఇన్స్పెక్టర్ ముత్తుయాదవ్ తెలిపారు.