మంత్రాల నెపంతో వృద్ధుడి దారుణ హత్య?
క్రైం న్యూస్ | మంత్రాల నెపంతో వృద్ధుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన జిల్లాలోని సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది.

యాదాద్రి భువనగిరి : మంత్రాల నెపంతో వృద్ధుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన జిల్లాలోని సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చిలువేరు మల్లయ్య ( 60)కు బంధువులతో చిన్న చిన్న తగాదాలు ఉన్న్నాయి. ఈ నేపథ్యంలో గత నెల రోజులుగా శివకుమార్ అనే యువకుడు అనారోగ్యం తో బాధపడుతూ నిన్న ఉదయం మరణించాడు.
దవాఖానల చుట్టూ తిరిగినప్పటికి నయం కాకపోవడంతో మల్లయ్యనే మంత్రాలు చేసి ఉంటాడని భావించి ఈ రోజు సాయంత్రం బావి వద్ద పశువులను మేపుతుండగా గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు పదునైన ఆయుధాలతో మల్లయ్యను దారుణంగా నరికి హత్య చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
పరవళ్లు తొక్కుతున్న పొచ్చర జలపాతం
నరసింహులపల్లి సమస్యలను పరిష్కరిస్తా : మంత్రి కొప్పుల
టీఆర్ఎస్ పార్టీలోకి ఎల్ రమణ?
బ్లాక్ ఫంగస్‌తో హెల్త్ సూపర్ వైజర్ మృతి
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

