ఇడ్లీ ఇస్తే తినలేదని ఆ ముగ్గురు ఏం చేశారంటే..
Begger murder case| మద్యం మత్తు ఎంతటి దారుణానికైన ఒడిగడుతుందని ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఘటనలు కళ్లకు కట్టినట్లు కనబడుతున్నాయి. మహిళపై
అమరావతి : మద్యం మత్తు ఎంతటి దారుణానికైన ఒడిగడుతుందని ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఘటనలు కళ్లకు కట్టినట్లు కనబడుతున్నాయి. మహిళపై ఘోరాలు , నేరాలు జరుగుతుంటే అమాయకులు సైతం వీరి బారిన పడి హత్యకు గురవుతున్నారు. ఇచ్చిన ఇడ్లి తినలేదన్న కక్షతో ఓ ముగ్గురు బిచ్చగాడిపై ప్రతాపం చూపి దారుణంగా హత్య చేసిన ఘటన గుంటూరు అర్బన్ ప్రాంతంలోని నల్లపాడు పరిధిలో చోటుచేసుకుంది.
ఈనెల 1వ తేదిన అర్ధరాత్రి మహేశ్ అనే వ్యక్తి మద్యం సేవించి వచ్చి తన వెంట తెచ్చుకున్న ఇడ్లీ పొట్లాన్ని బిచ్చగాడికి ఇస్తూ నువ్వు చడ్డీ గ్యాంగ్ ముఠా సభ్యుడిలా ఉన్నావు. పోలీసులతో జాగ్రత్త అంటూ వ్యంగ్యంగామాట్లాడాడు. దీంతో మనస్థాపానికి గురైన బిచ్చగాడు ఇడ్లీపొట్లాన్ని విసిరేశాడు. దీంతో కోపంతో వెళ్లిపోయిన మహేశ్ కొద్దిసేపటికి అతడి స్నేహితులు అనిల్, సతీశ్తో కలిసి వచ్చి బిచ్చగాడిపై దాడి చేశారు. అతడిని ద్విచక్రవాహనంపై తీసుకెళ్లి అంకిరెడ్డిపాలెం డొంకరోడ్డులో మరోసారి దాడి చేయడంతో బిచ్చగాడు అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందితులను గురువారం అదుపులోకి విచారించగా నేరాన్ని అంగీకరించారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ జెస్సి ప్రశాంతి మీడియా సమావేశంలో తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- Andhra Pradesh
- arrest
- Begger
- Guntur
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

