POCSO Case : మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపుల ఘటనలు తీవ్రమయ్యాయి. కోల్‌కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో వైద్యురాలిపై హత్యాచార ఘటన మరువక ముందే పలు లైంగిక దాడుల ఉదంతాలు వెలుగుచూస్తుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. మహారాష్ట్రలోని థానే స్కూల్లో మూడేండ్ల వయసు కలిగిన ఇద్దరు బాలికలపై స్కూల్ క్లీనింగ్ సిబ్బంది ఒకరు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన కలకలం రేపింది.
ఆగస్ట్ 12-13 తేదీల్లో చిన్నారులు స్కూల్ వాష్‌రూంకు వెళ్లిన క్రమంలో ఈ ఘటన జరగ్గా పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. థానే జిల్లా బద్లాపూర్‌లో ఈ ఉదంతం వెలుగుచూసింది. నిందితుడు అక్షయ్ షిండేను కోర్టు మూడు రోజుల పోలీస్ రిమాండ్‌కు తరలించింది. బాలికల తల్లితండ్రుల ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
పోక్సో కేసులో సైతం స్ధానిక సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ శుభద షిటోలె ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యం చేశారని బాధిత తల్లితండ్రులు, స్ధానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన ప్రిన్సిపల్, క్లాస్ టీచర్, సంబంధిత సిబ్బందిని అధికారులు సస్పెండ్ చేశారు. కాగా, ఈ ఘటనపై స్ధానికులు బద్లాపూర్‌లో నిరసనలకు దిగారు. బద్లాపూర్ రైల్వే స్టేషన్లో లోకల్ ట్రైన్‌ను నిరసనకారులు నిలిపివేశారు.
Read More :
Lightning | పంజాగుట్టలోని అపార్టుమెంట్ వద్ద పిడుగుపాటు.. కారు ధ్వంసం