ఆర్థిక ఇబ్బందులతో ఒకరు.. తండ్రి మందలించాడని మరొకరు ఆత్మహత్య

ఆమనగల్లు : ఆర్థిక సమస్యలతో వ్యక్తి మృతి చెందిన సంఘటన మాడ్గుల మండల కేంద్రంలో చోటు చేసుకుంది. శుక్రవారం సీఐ కృష్ణమోహన్ కథనం ప్రకారం.. మాడ్గుల మండల కేంద్రానికి చెందిన పావలయ్య (39) భార్య ఆలివేలుతో కూలి పనులు చేసుకుంటూ గ్రామంలోనే జీవనం కొనసాగిస్తున్నాడు. కొంతకాంలగా ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతూన్నాడు. బాధితుడు గురువారం ఉదయం ఇంటి నుంచి కూలీ పనికి వేళ్తున్ననని భార్యకు చెప్పి వెళ్లాడు. శుక్రవారం గ్రామానికి చెందిన గొర్రెల కాపరి జంగయ్య గ్రామ సమీపంలోని చెట్టుకు పావలయ్య ఉరేసుకున్నట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని కిందకు దింపి పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. భార్య అలివేలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని తెలిపారు.
మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య
మాడ్గుల మండలంలోని దిల్వార్ఖాన్పల్లి గ్రామంలో తండ్రి మందలించాడని మనస్థాపానికి గురై విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. సీఐ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బావాజీ వెంకటయ్య, లక్ష్మమ్మ దంపతులకు ఒక కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కూతురు రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతుంది. కూతురు ఆన్లైన్ తరగతులు వినడం లేదని తండ్రి శైలజను మందలించాడు. దీంతో మనస్థాపానికి గురైన శైలజ వారి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు బాధితురాలిని చికిత్స నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించడంతో మేరుగైన వైద్యం కోసం నగరంలోని ఉస్మానియా దవాఖానకు తరలించారు. చికిత్సపొందుతూ శైలజ శుక్రవారం మృతి చెందినట్లు సీఐ పేర్కొన్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

