Stray Dog | గుజరాత్‌లోని సూరత్‌లో ఓ వీధి కుక్క వీరంగం సృష్టించింది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ బాలికపై దాడి చేసి.. దారుణంగా గాయపరిచింది. కింద పడిన బాలిక ముఖంపై పలు చోట్ల కరిచింది. ఆ చిన్నారి చెంపను నోటితో చీల్చింది. గమనించిన ఆ బాలిక తల్లి వెంటనే అక్కడకు వచ్చి.. కుక్క బారి నుంచి ఆ చిన్నారిని కాపాడింది. ఈ క్రమంలో బాలిక తల్లిని కూడా ఆ కుక్క కరిచింది. ఆమె గట్టిగా విదిలించడంతో ఆ కుక్క అక్కడి నుంచి వెళ్లిపోయింది.
ఇంతలో ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకుని.. కుక్క దాడిలో తీవ్రంగా గాయపడిన బాలికను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ చిన్నారి ముఖం నిండా కుట్లు పడినట్లు వైద్యులు తెలిపారు. పాప పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు చెప్పారు. హన్స్‌పురా సొసైటీలో శనివారం జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
સુરતમાં બાળકી પર હડકાયું શ્વાન તૂટી પડ્યું, ગાલે બચકાં ભરી કરડી ખાતાં હોસ્પિટલમાં દાખલ #surat #dogs #streetdog pic.twitter.com/xNtzXOIlD2
— Gujarat Tak (@GujaratTak) January 9, 2023