Fake call | స్టాఫ్ నర్సు ఉద్యోగమంటూ మోసం.. కేసు నమోదు

వెంగళరావునగర్ : రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సీనియర్ స్టాఫ్ నర్సు ఉద్యోగమంటూ అగంతకులు ఓ మహిళను మోసం చేసిన సంఘటన ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం..అమీర్‌పేటలోని శ్యామ్‌కరణ్ రోడ్డుకు చెందిన గౌతమి ఓ ప్రైవేటు దవాఖానాలో నర్సుగా పనిచేస్తుంది.
కాగా గత నెల 25న తన సెల్ ఫోన్‌కు ఒక కాల్ వచ్చింది. నగరంలోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్టాఫ్ నర్సు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలని చెప్పడంతో అగంతకులు పంపిన నకిలీ వెబ్సైట్లోకి వెళ్లిన గౌతమి తన వివరాలను అందులో నమోదు చేసింది.
అగంతకులు గౌతమికి ఫోన్‌చేసి పరీక్ష రుసుము రూ.5 వేలు, ప్రొసెసింగ్ ఫీజు రూ. 5 వేలు, కొరియర్ చార్జీలు రూ.10 వేలు, దరఖాస్తు ప్రాసెసింగ్ కోసం మరో రూ.10 వేలు పంపాలని చెప్పడంతో దఫాల వారీగా మొత్తం రూ.79,596లను తన ఎస్బీఐ ఖాతా నుంచి అగంతకులు పంపిన వెబ్సైట్ ద్వారా బాధితురాలు చెల్లించింది.
అనంతంరం అగంతకుల నుంచి స్పందన లేకపోవడంతో తాన మోసపోయానని గ్రహించిన గౌతమి శనివారం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

