బిజనోర్: ఒక ఆరేళ్ల చిన్నారిని మాయమాటలు చెప్పి ఒక పాడుబడిన బంగ్లాలోకి తీసుకెళ్లాడా నీచుడు. అనంతరం ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఘటన జరిగిన తర్వాత ఇంటికొచ్చిన ఆ చిన్నారి తల్లిదండ్రులకు తనకు ఎదురైన భయానక అనుభవాన్ని వివరించింది. విషయం తెలుసుకున్న ఆ పేరెంట్స్ వెంటనే పోలీసులను ఆశ్రయించారు.
దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుడు షహబాజ్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మిర్జాపూర్ గ్రామంలో వెలుగు చూసింది. స్కూల్కు బయలుదేరిన చిన్నారికి మాయమాటలు చెప్పిన షహబాజ్.. ఆమెను దగ్గరలోని ఒక పాడుబడిన ఇంటికి తీసుకెళ్లి, అక్కడే ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని బిజనోర్ ఎస్పీ ధరమ్వీర్ సింగ్ తెలిపారు.
నిందితుడు షహబాజ్పై ఐపీసీ సెక్షన్ 376 (అత్యాచారం), పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అలాగే మైనర్ బాలికను వైద్యపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.