రాజన్న సిరిసిల్ల : సరదాగా ఈతకు వెళ్లి ఓ విద్యార్థి మృతి చెందగా.. నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది. సిరిసిల్ల పట్టణంలోని వెంకంపేట ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఎనిమిది మంది విద్యార్థులు కలిసి మానేరులోని చెక్‌డ్యామ్‌లో ఈత కోసం వెళ్లారు. ఈ క్రమంలో ఐదుగురు విద్యార్థులు నీటిలో మునిగిపోయారు. దీంతో మిగతా ముగ్గురు విద్యార్థులు బట్టలు లేకుండా పరుగులు పెట్టడంతో అక్కడే ఉన్న స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాలింపు చేపట్టగా.. రాజీవ్‌నగర్‌కు చెందిన కొలిపాక గణేశ్ (12) మృతదేహం లభ్యమైంది. మిగతా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. గల్లంతైన విద్యార్థులు వెంకటసాయి, అజయ్, కాంత్రి, రాకేశ్‌గా గుర్తించారు. సరదాగా ఈతకు వెళ్లి పిల్లలు గల్లంతుకావడంతో కుటుంబీకులు కన్నీరు మున్నీరవుతున్నారు. స్థానికంగా విషాదం అలుముకున్నది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.