శంషాబాద్ : సైబరాబాద్ పోలీసులు గురువారం అరెస్టు చేసిన శంకర్పల్లి దోపిడి దొంగల ముఠాలో ప్రధాన నిందితుడు ఏ-1 హర్షద్ ఖాన్(21) పోలీసుకస్టడీ నుంచి పారిపోయాడు. శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసుల వివరాల ప్రకారం… దారి దోపిడీలకు పాల్పడుతున్న 6 గురు సభ్యులు గల అంతరాష్ట్ర ముఠాను శంషాబాద్ ఎస్ఓటి, శంకర్పల్లి పోలీసులు పట్టుకొన్న విషయం తెలసిందే.
కాగా శుక్రవారం తెల్లవారు జామున వారిని జైలుకు తరలిస్తున్న క్రమంలో మూత్ర విసర్జన కోసమని కిందకు దిగిన హర్షద్ పారిపోయాడు. కాగా పోలీసులు నిందితుని కోసం గాలిస్తున్నారు.