ఆన్లైన్లో వైన్ ఆర్డర్ : మహిళ నుంచి రూ 5 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు!
బ్యాంక్ ఖాతాల నుంచి క్షణాల్లో సొమ్ము మాయం చేస్తూ సైబర్ నేరగాళ్లు చెలరేగుతున్నారు. వైన్ కోసం ఆన్లైన్లో ఆర్డర్ చేసేందుకు ప్రయత్నించిన మహిళ (32) నుంచి నేరగాళ్లు రూ 4.8 లక్షలు కాజేశారు.
ముంబై : బ్యాంక్ ఖాతాల నుంచి క్షణాల్లో సొమ్ము మాయం చేస్తూ సైబర్ నేరగాళ్లు చెలరేగుతున్నారు. వైన్ కోసం ఆన్లైన్లో ఆర్డర్ చేసేందుకు ప్రయత్నించిన మహిళ (32) నుంచి నేరగాళ్లు రూ 4.8 లక్షలు కాజేశారు. మహిళ ఫిర్యాదు ఆధారంగా పొవై పోలీస్ స్టేషన్లో సైబర్ నేరగాళ్లపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఏప్రిల్ 4న బాధితురాలి ఇంటికి ఆమె వదిన రాగా, ఈలోగా మహిళ ఆమె భర్త స్ధానిక వైన్ షాపు నుంచి వైన్‌ను ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వాలని నిర్ణయించారు. గూగుల్‌లో సమీప వైన్ షాపుల గురించి సెర్చ్ చేశారు.
ఈ క్రమంలో పొవైలోని ఓం సాయి బీర్ షాపును గుర్తించిన మహిళ అక్కడున్న ఫోన్ నెంబర్‌కు కాల్ చేసింది. తాము క్యాష్ ఆన్ డెలివరీని అంగీకరించడం లేదని రూ 650 గూగుల్ పే ద్వారా పంపాలని నేరగాడు బదులిచ్చాడు. అయితే రూ 30 ఎక్కువ పంపారని చెంపిన నిందితుడు ఆమెకు ఆ మొత్తం తిరిగి పంపుతానని క్యూఆర్ కోడ్ పంపాడు.
క్యూఆర్ కోడ్‌ను ఆమె స్కాన్ చేయగానే రూ 19,991 ఖాతా నుంచి నిందితుడి ఖాతాకు బదిలీ అయ్యాయి. ఈ విషయం అతడికి తెలపడంతో పొరపాటు జరిగిందని ఆ మొత్తం రిటన్ చేస్తానంటూ మరో క్యూఆర్ కోడ్ పంపాడు. తిరిగి ఆ కోడ్‌ను ఆమె స్కాన్ చేయగానే ఈ సారి ఏకంగా రూ 96,108 బాధితురాలు ఖాతా నుంచి కట్ అయ్యాయి. ఇలా ఏకంగా రూ 4.80 లక్షల వరకూ ఆమె నుంచి నిందితుడు కాజేశాడు. మహిళ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

