న్యూఢిల్లీ : పీకల దాకా మద్యం సేవించిన మందుబాబులు రెస్టారెంట్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఢిల్లీకి సమీపంలోని గ్రేటర్ నోయిడాలో గురువారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. ఓ ఐదుగురు యువకులు డిన్నర్ కోసం రెస్టారెంట్‌కు వెళ్లారు. డిన్నర్ చేస్తున్న క్రమంలో రెస్టారెంట్ సిబ్బందితో వారు గొడవకు దిగారు. అసభ్యకరమైన పదజాలంతో దూషించారు. దీంతో సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు.
మరింత రెచ్చిపోయిన మందుబాబులు.. రెస్టారెంట్ స్టాఫ్‌పై దాడులకు పాల్పడ్డారు. సిబ్బందిని చితకబాదారు. సిలిండర్‌ను ఎత్తెసేందుకు ఒకరు ప్రయత్నించారు. అప్రమత్తమైన రెస్టారెంట్ యజమాని మహేశ్ శర్మ దన్కౌర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఆ దృశ్యాలను పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే రెస్టారెంట్ నుంచి దుండగులు పారిపోయే ముందు.. బెదిరింపులకు పాల్పడ్డారు. అక్కడే ఒక స్కూటీ, బైక్‌ను దుండగులు వదిలేసి వెళ్లిపోయారు.
SCUFFLE inside a restaurant in Greater #Noida. Dankaur police is investigating the case. pic.twitter.com/APMBWLRtyx
— alok singh (@AlokReporter) January 28, 2022