లక్నో : లైంగిక దాడి కేసులో బాధితురాలి (28)ని బెదిరించి పెండ్లి పేరుతో లోబరుచుకుని రెండేండ్లుగా పలుమార్లు లైంగిక దాడులకు పాల్పడిన పోలీస్ కానిస్టేబుల్ (31)పై కేసు నమోదైంది. కానిస్టేబుల్ తనపై లైంగిక దాడులకు పాల్పడి ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
రెండేండ్ల కిందట స్ధానిక యువకుడు తనను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో నిందితుడికి కోర్టు శిక్ష విధించింది. కేసు దర్యాప్తు పేరుతో బాధితురాలి ఇంటికి వెళ్లిన కానిస్టేబుల్ ఆమెను తుపాకీతో బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. పెండ్లి చేసుకుంటానని నమ్మబలుకుతూ గత రెండేండ్లుగా పలుమార్లు ఆమెపై లైంగిక దాడులకు తెగబడ్డాడు.
ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని హెచ్చరించాడు. ఆపై కానిస్టేబుల్‌కు వివాహమైందని, ఐదేండ్ల కుమారుడు ఉన్నాడని తెలిసిన బాధితురాలు అతడిని నిలదీయడంతో ఆమెను హతమారుస్తానని బెదిరింపులకు గురిచేశాడు. బాధితురాలి ఫిర్యాదుపై కీచక కానిస్టేబుల్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.