హైదరాబాద్ : ఓ విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించిన గౌతమి జూనియర్ కాలేజీ చైర్మన్, ప్రిన్సిపల్ సత్యనారాయణపై హయత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల గౌతమి కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న ఓ విద్యార్థినికి ప్రిన్సిపల్ ఫోన్లో మాయమాటలు చెప్పి.. సినిమాకు తీసుకెళ్లాడు. సినిమా హాల్లో అమ్మాయితో అసభ్యకరంగా ప్రవర్తించాడు సత్యనారాయణ.
మళ్లీ ఆమెకు ఫోన్ చేసి నీకు స్పెషల్ క్లాస్ తీసుకుంటాను.. కాలేజీకి రావాలని కోరాడు. దీంతో భయపడ్డ బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పింది. బాధితురాలి పేరెంట్స్ హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి, సత్యనారాయణను నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్నారు.