చెన్నై: సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించే క్యారెక్టర్ ఆర్టిస్ట్ (38)పై లైంగిక వేధింపులకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. నటి వద్ద నగదు, బంగారు ఆభరణాలను దోచుకున్న నిందితులు ఆమెను లైంగికంగా వేధించారని పోలీసులు తెలిపారు.
కత్తితో నటిని బెదిరించిన ఇద్దరు నిందితులు ఆమె పట్ల అసభ్యంగా వ్యవహరించారు. నటి నుంచి రూ 50,000 నగదుతో పాటు బంగారు ఆభరణాలను లూటీ చేశారు. దుస్తులు తొలగించాలని కూడా నటిని వారు బెదిరించారు. నటి ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు నిందితులను రామాపురానికి చెందిన సెల్వకుమార్ (21), కన్నదాసన్ (37)లుగా గుర్తించారు. వారి వద్ద నుంచి బంగారు ఆభరణాలు, మూడు సెల్ఫోన్లు, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. బాధితురాలు పలు సినిమాల్లో సహాయ పాత్రలు పోషించింది.