బుధవారం 23 సెప్టెంబర్ 2020
Crime - Jun 15, 2020 , 16:47:17

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

నార్కట్‌పల్లి : మండల పరిధిలోని 65వ నెంబర్‌ జాతీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. వివరాలు.. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు గ్రామానికి చెందిన వనం భిక్షమయ్య (53) అటవీ శాఖలో కాంట్రాక్టు కూలిగా పని చేస్తున్నాడు. విధుల్లో భాగంగా సోమవారం మధ్యాహ్నం నార్కట్‌పల్లికి చెందిన చెరుకుపల్లి కిరణ్‌తో కలిసి ద్విచక్రవాహనంపై న్యూ వివేరా హోటల్‌ వద్ద రహదారి వెంట మొక్కలను పరిశీలించి తిరిగి నార్కట్‌పల్లికి వస్తుండగా.. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ట్యాంకర్‌ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెనుక కూర్చున్న భిక్షమయ్య ట్యాంకర్‌ కింద పడి అక్కడికక్కడే మృతి చెందగా కిరణ్‌కు స్వల్పగాయాలయ్యాయి. మృతుడి కుమారుడు శంకర్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ యాదయ్య తెలిపారు. 


logo