Cyber crime | సైబర్ మోసగాళ్ల ఏజెంట్‌పై పీడీయాక్ట్

హైదరాబాద్ : సైబర్ దొంగల మోసాలను అరికట్టేందుకు రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ నైజీరియన్ ముఠాలకు సహకరిస్తున్న ఏజెంట్ పై బుధవారం పీడీ యాక్ట్‌ను విధించారు. బీహర్‌కు చెందిన అనిల్‌కుమార్ పాండే జీవనోపాధి కోసం ఢిల్లీ వెళ్ళాడు. అక్కడ పరిచయమైన నైజీరియన్ ముఠాలతో స్నేహం చేశాడు. వారి సూచన మేరకు అనిల్‌కుమార్ పాండే బ్యాంక్ ఖాతాలను తెరిచి వాటికి సంబంధించిన డెబిట్ కార్డులను వారికి ఇచ్చి వారి వద్ద నుంచి 10 శాతం కమిషన్‌ను తీసుకుంటున్నాడు.
ఇలా ఢిల్లీలో ఓ కిరాణా దుకాణం పెట్టుకుని తెలిసిన వారితో బ్యాంక్ ఖాతాలను తెరిపించి వారి డెబిట్ కార్డులను నైజీరియన్ ముఠాలకు ఇచ్చేవాడు. ఓ కేసు దర్యాప్తులో భాగంగా జూలై నెలలో రాచకొండ సైబర్ కైం పోలీసులు అనిల్‌కుమార్ పాండేతో పాటు నైజీరియాకు చెందిన ఒబినేన్ ని అరెస్టు చేశారు. విచారణలో అనిల్‌కుమార్ పాండే తెరిచిన ఖాతాలలో అమాయకులకు చెందిన దాదాపు 24.50 లక్షల నగదును బదిలీ చేసుకుని ఆ తర్వాత వాటిని సైబర్ మోసగాళ్లు తీసుకున్నారని పోలీసులు గుర్తించారు.
ఇలా నాలుగు కేసులలో అనిల్‌కుమార్ పాండే నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు దర్యాప్తులో తేల్చారు. దీంతో చర్లపల్లి జైలులో ఉన్న అతని పై సీపీ మహేష్ భగవత్ పీడీ యాక్ట్‌ను విధించి ఏడాది పాటు జైలులో ఉండేలా చర్యలు తీసుకున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

