భోపాల్: బెయిల్‌పై విడుదలైన వ్యక్తి తిరిగి అదే మహిళపై మళ్లీ లైంగిక దాడికి పాల్పడ్డాడు. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. వివేక్ పటేల్ అనే వ్యక్తి 2020లో మైనర్ బాలికపై లైంగిక దాడి చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. ఏడాది పాటు జైల్లో ఉన్న ఆ నిందితుడు 2021లో బెయిల్‌పై విడుదల అయ్యాడు. ప్రస్తుతం 19 ఏళ్ల వయసున్న ఆ మహిళ ఇంటికి స్నేహితుడితో కలిసి గత నెల వెళ్లాడు. ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి కత్తి చూపి ఆ యువతిని బెదిరించాడు. స్నేహితుడితో కలిసి ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీనిని మొబైల్లో రికార్డు చేశాడు. లైంగిక దాడి కేసును వెనక్కి తీసుకోకపోతే వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడు.
కాగా, బాధితురాలు మరోసారి పోలీసులను ఆశ్రయించింది. స్నేహితుడికితో కలిసి లైంగిక దాడికి పాల్పడిన ఆ నిందితుడిపై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు గ్యాంగ్ రేప్ కింద కేసు నమోదు చేశారు. ఆ వ్యక్తితోపాటు అతడి స్నేహితుడ్ని అరెస్ట్ చేసేందుకు వారి కోసం వెతుకుతున్నారు.