పటాన్చెరు/సంగారెడ్డి : మెదక్ స్థానిక సంస్థల శాసనమండలి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన స్వతంత్ర అభ్యర్థి గుండు ప్రవీణ్‌కుమార్ తమ అనుమతి లేకుండా తాము బలపర్చినట్టు ఫోర్జరీ సంతకాలు చేశాడని పటాన్చెరు డీఎస్పీ భీంరెడ్డికి జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, అమీన్పూర్ జడ్పీటీసీ సుధాకర్‌రెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్, ముత్తంగి ఎంపీటీసీ గడీల కుమార్‌గౌడ్ ఫిర్యాదు చేశారు.
సోమవారం పటాన్చెరు డీఎస్పీ కార్యాలయంలో భీంరెడ్డికి వారు ఫిర్యాదు చేసి పత్రిక ప్రకటనను విడుదల చేశారు. మెదక్ స్వతంత్ర అభ్యర్థిగా శాసనమండలి ఎన్నికల్లో నామినేసన్ వేసిన స్వతంత్ర అభ్యర్థి ప్రవీణ్‌కుమార్ ఫోర్జరీ సంతకాలతో సమర్పించాడని ఆరోపించారు. పటాన్చెరు పట్టణానికి చెందిన గుండు ప్రవీణ్‌కుమార్‌ను తాము బలపరుస్తున్నట్లు ఫోర్జరీ సంతకాలు చేశాడని పేర్కొన్నారు.
తన స్వార్థం కోసం తమ పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించిన ప్రవీణ్‌కుమార్‌పై న్యాయపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు దశరథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.