తిరువనంతపురం : కేరళలోని తిరువనంతపురంలో విషాదం జరిగింది. కొత్త జంట ఫొటోషూట్లో పాల్గొంటూ గుట్ట మీద నుంచి పల్లికల్ నదిలో పడటంతో నవ జంట సహా ముగ్గురు మరణించారు. జంటను కాపాడేందుకు వారి కుటుంబ సభ్యులొకరు నదిలో దూకడంతో అతడు కూడా మృత్యువాతన పడటంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మృతులను సిద్ధిఖి, నౌఫి, అన్సిల్గా గుర్తించారు. నవజంట కొల్లాం జిల్లాకు చెందిన వారని అధికారులు గుర్తించారు. శనివారం సాయంత్రం ఈ ఘటన జరగ్గా ఆదివారం సాయంత్రం మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాలను కొల్లాం మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించారు.
జంటకు కేవలం వారం కిందటే వివాహం కాగా ఓ ఫంక్షన్లో పాల్గొనేందుకు వారు అన్సిల్ ఇంటికి వచ్చారు. ఆపై ముగ్గురు సమీపంలోని నది వద్దకు ఫొటోలు తీసుకునేందుకు రాగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఫొటోలు తీసుకునే క్రమంలో పట్టు తప్పడంతోనే నూతన దంపతులు గుట్టపై నుంచి నదిలో పడినట్టు స్ధానికులు తెలిపారు.
Read More :