e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, August 3, 2021
Home క్రైమ్‌ ప్రేమను అంగీకరించని పెద్దలు.. యువ జంట ఆత్మహత్య

ప్రేమను అంగీకరించని పెద్దలు.. యువ జంట ఆత్మహత్య

ప్రేమను అంగీకరించని పెద్దలు.. యువ జంట ఆత్మహత్య

అహ్మదాబాద్‌: పెద్దలు తమ ప్రేమను అంగీకరించకపోవడంతో యువ జంట చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గుజరాత్‌లోని సావ్లి తాలూకా డోడ్కా గ్రామంలో ఈ ఘటన జరిగింది. మోక్ష్ గ్రామంలో ఇరుగుపొరుగున నివసించే 21 ఏండ్ల హరీష్ చావ్డా, సీమా చావ్డా ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. పెండ్లి చేసుకోవాలని ఈ జంట భావించగా ఒకే ఇంటి పేరు కావడంతో కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. కాగా, సీమాకు ఇటీవల మరో వ్యక్తితో ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. ఈ నేపథ్యంలో కలిసి జీవించలేమని భావించిన ప్రేమికులు కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు.

బుధవారం వారిద్దరూ తమ ఇండ్ల నుంచి వెళ్లిపోయారు. ఇరు కుటుంబాలు ఎంత వెదికిన వారి జాడ తెలియలేదు. గురువారం రాత్రి ఆ జంట ఒక చెట్టుకు తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చెట్టుకు వేలాడుతున్న వీరిని మరునాడు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలంలో వాటర్‌ బాటిల్‌తోపాటు నీలం రంగులో ఉన్న మరో సీసాను పోలీసులు గుర్తించి పరీక్షకు పంపారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్రేమను అంగీకరించని పెద్దలు.. యువ జంట ఆత్మహత్య
ప్రేమను అంగీకరించని పెద్దలు.. యువ జంట ఆత్మహత్య
ప్రేమను అంగీకరించని పెద్దలు.. యువ జంట ఆత్మహత్య

ట్రెండింగ్‌

Advertisement