తప్పుడు లైంగిక దాడి ఆరోపణలు చేసిన మహిళకు.. పదేండ్లు జైలు శిక్ష

భోపాల్: నలుగురు వ్యక్తులు తనపై సామూహిక లైంగిక దాడికి పాల్పడినట్లు తప్పుడు ఆరోపణలతో ఫిర్యాదు చేసిన మహిళ, ఆమె ప్రియుడికి కోర్టు పదేండ్ల జైలు శిక్ష విధించింది. మధ్యప్రదేశ్‌లోని అశోక్ నగర్ జిల్లాకు చెందిన 46 ఏండ్ల గుడ్డీ ఔజా అనే మహిళ భర్త 2011లో మరణించాడు. అనంతరం అల్లుడైన 29 ఏండ్ల గోపాల్ రజక్తో వివాహేతర సంబంధం కలిగి ఉన్నది. దీనిపై పొరుగున ఉన్న వ్యక్తులు హేళన చేస్తుండటంతో వారిపై అత్యాచార ఆరోపణలు చేసింది. పొరుగున్న ఉన్న నలుగురు రాత్రి వేళ ఇంట్లోకి చొరబడి తనపై సామూహిక లైంగిక దాడికి పాల్పడినట్లు 2014 ఆగస్ట్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత దుస్తులు, వీర్యాన్ని పోలీసులు భద్రపరిచారు. నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ కేసు నాడు స్థానికంగా కలకలం రేపింది. నిందితులను కఠినంగా శిక్షించాలని రాజకీయ నేతలు, సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేశారు.
అయితే తాము ఏ తప్పు చేయలేదని, తమపై తప్పుడు ఆరోపణలు చేసినట్లు నిందితులైన నలుగురు వ్యక్తులు కోర్టుకు తెలిపారు. అల్లుడితో ఆమె వివాహేతర సంబంధం నేపథ్యంలో తమను ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు. నిజ నిర్ధారణ కోసం వీర్యానికి డీఎన్ఏ టెస్ట్ చేయాలని కోరారు.
దీంతో వీర్యానికి డీఎన్ఏ టెస్ట్ చేయగా అది వారిది కాదని తేలింది. గోపాల్ రజక్ వీర్యంతో మ్యాచ్ అయ్యింది. దీంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసి ప్రశ్నించగా అసలు సంగతి బయటపెట్టాడు. తమ ఇద్దరి మధ్య సంబంధం ఉన్నదని, తమతో వైరం ఉన్న పొరుగింటి వ్యక్తులను ఇరికించేందుకు తప్పుడు కేసు పెట్టినట్లు ఒప్పుకున్నాడు.
నేరపూరిత కుట్రతో తప్పుడు ఫిర్యాదు చేయడంతోపాటు తప్పుడు ఆధారాలు సృష్టించిన వారిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ జరిపిన కోర్టు మహిళతోపాటు ఆమె అల్లుడికి పదేండ్ల జైలు శిక్ష విధించింది. తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఆరు నెలల జైలు శిక్ష కూడా విధించింది.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

