ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Sep 13, 2020 , 15:42:46

బాలికపై నలుగురు లైంగిక దాడి.. నిందితుల్లో 60 ఏండ్ల వృద్ధుడు

బాలికపై నలుగురు లైంగిక దాడి.. నిందితుల్లో 60 ఏండ్ల వృద్ధుడు

పాటియాల : బాలికపై నలుగురు లైంగిక దాడికి పాల్పడ్డారు. పంజాబ్‌లోని పాటియాలలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాటియాలకు చెందిన 16 ఏండ్ల బాలిక నెల క్రితం ఇంటి సమీపంలోని కిరాణా షాపునకు వస్తువులు కొనేందుకు వెళ్లింది. షాపు యజమాని ఆమెను లోపలి గదిలోకి లాగి తన ముగ్గురు స్నేహితులతో కలిసి లైంగిక దాడి చేశాడు. ఘటన గురించి ఎవరికైనా చెబితే భయంకర పరిణామాలుంటాయని బాలికను బెదిరించి వదిలేశారు. ఇటీవల బాధితురాలు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలిక వాంగ్మూలం నమోదు చేసి నేరానికి పాల్పడిన ముగ్గురిని ఆదివారం అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకరైన 60 ఏండ్ల వృద్ధుడు పరారీలో ఉన్నాడు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo