బెంగళూర్ : కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో మైనర్ బాలికపై సామూహిక లైంగిక దాడి ఘటన కలకలం రేపింది. బంత్వాల్ తాలూకాలోని అంటాడీ గ్రామంలో ఐదుగురు వ్యక్తులు బాలికపై ఈ దారుణానికి ఒడిగట్టారు. బాధిత బాలిక శుక్రవారం స్కూల్ నుంచి ఇంటికి తిరిగివస్తుండగా పరిచయమున్న వ్యక్తి తన కారులో ఆమెను ఎక్కించుకుని నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి మరికొందరితో కలిసి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఆపై బాలికను బ్రహ్మరకుట్లు ప్రాంతంలో దించేసి పరారయ్యారు. బాలిక స్టేట్మెంట్ను రికార్డు చేసిన పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగి ఐదుగురు నిందితుల్లో ఇద్దరిని అరెస్ట్ చేశారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నిందితులపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.