లక్నో : తమ వివాహానికి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో పోలీస్ స్టేషన్లోనే ప్రేమ జంట వైవాహిక బంధంతో ఒక్కటయింది. యూపీలోని మీరట్ జిల్లాకు చెందిన యువతి తన గ్రామంలోని యువకుడిని ఆరేండ్లుగా ప్రేమిస్తోంది. వారి వివాహానికి ఇరు కుటుంబాలు అడ్డుచెప్పడంతో విసిగిన యువతి బుధవారం ప్రియుడి ఇంటికి వెళ్లి పెండ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది.
వ్యవహారం పోలీస్ స్టేషన్కు చేరడంతో పోలీసులు ఇరు కుటుంబాలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ప్రియుడితో పెండ్లి జరిపించాల్సిందేనని యువతి పట్టుబట్టడంతో కుటుంబ సభ్యులను ఒప్పించి పోలీస్ స్టేషన్లోనే వారికి వివాహం జరిపించారు.