న్యూఢిల్లీ : యువతికి అభ్యంతరకర వీడియోను పంపిన 26 ఏండ్ల ఎంబీఏ గ్రాడ్యుయేట్‌ను నోయిడా పోలీసులు అరెస్ట్ చేశారు. నోయిడాలోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో చదువుతున్న ఎంబీఏ విద్యార్ధి గత రెండేండ్లుగా 20 ఏండ్ల యువతితో సన్నిహితంగా మెలుగుతున్నాడు.
అయితే అతడి ప్రవర్తన నచ్చకపోవడంతో గత కొద్దిరోజులుగా ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను దూరం పెట్టింది. మార్చి 19న తనతో జిమ్‌కు రావాలని అతడు కోరడంతో మరో అవకాశం ఇవ్వాలని భావించిన యువతి అతడికి ఫోన్ నెంబర్ ఇచ్చింది. మార్చి 21న వాట్సాప్‌లో నిందితుడు వివేక్ త్రివేది ఆమెకు తన హస్తప్రయోగం వీడియోను పంపడంతో బాధితురాలు షాక్‌కు గురైంది.
తనతో శారీరకంగా కలవాలని కూడా నిందితుడు ఒత్తిడి చేస్తుండటంతో ఆమె నిరాకరించింది. నిందితుడు అభ్యంతరకర వీడియో పంపడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం ఉదయం నోయిడా సెకా్టర్ 61లో అతడిని అరెస్ట్ చేశారు. మేజిస్ట్రేట్ ఎదుట నిందితుడిని హాజరు పరచగా ఆపై జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు.