న్యూఢిల్లీ: కారు పార్కింగ్ విషయంపై కొందరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి తలపై రాయితో కొట్టి దారుణంగా హత్య చేశారు. దేశ రాజధాని ఢిల్లీ సమీప ప్రాంతమైన ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. మృతుడ్ని 35 ఏళ్ల వరుణ్‌గా గుర్తించారు. అతడు తన కుటుంబంతో కలిసి ఒక ఈటరీ సమాపంలో నివసిస్తూ పాల వ్యాపారం చేస్తున్నాడు. అయితే మంగళవారం రాత్రి వరుణ్ తన కారును ఈటరీ బయట పార్క్ చేశాడు. పక్కన పార్క్ చేసిన మరో కారు డోర్ తెరిచేందుకు వీలు లేనంతగా అతడు తన కారును పార్క్ చేయడంపై కొందరు వ్యక్తులతో ఘర్షణ జరిగింది. ఇది ఫైటింగ్‌కు దారి తీసింది. దీంతో కింద పడిన వరుణ్ తలపై ఒక వ్యక్తి రాయితో పలుసార్లు మోదాడు. అనంతరం వారు అక్కడి నుంచి పారిపోయారు.
కాగా, తీవ్రంగా గాయపడిన వరుణ్‌ను ఢిల్లీలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అతడు అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను అరెస్ట్ చేసేందుకు ఐదు పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు.
మరోవైపు ఈ సంఘటన కలకలం రేపింది. స్థానికులు నిరసనకు దిగారు. నేరాల నియంత్రణలో విఫలమైన పోలీసుల తీరుపై జనం మండిపడ్డారు. కాగా, ఆ సమయంలో వాహనంలో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి తన మొబైల్ఫోన్లో రికార్డు చేసిన ఘర్షణకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
On Camera, Man's Head Smashed With Brick In Fatal Fight Over Parking https://t.co/ae5yjZbGlh pic.twitter.com/mHWvyFWZE1
— NDTV (@ndtv) October 26, 2022