న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఆన్లైన్ స్కామ్స్ (Cyber Fraud) విపరీతంగా పెరుగుతున్నాయి. తాజా సైబర్ క్రైమ్ ఘటనలో 56 ఏండ్ల నాగపూర్ నివాసి సరికొండ రాజు అనే వ్యక్తిని స్కామర్లు ఏకంగా రూ. 77 లక్షలకు ముంచేశారు. యూట్యూబ్‌లో వీడియోలను లైక్ చేస్తూ అదనపు ఆదాయాన్ని ఆర్జించవచ్చని స్కామర్లు రాజును మభ్యపెట్టారు.
రాజును టెలిగ్రాం ఖాతా ద్వారా తొలుత సైబర్ నేరగాడు సంప్రదించాడు. లైక్ చేసిన యూట్యూబ్ వీడియోల స్క్రీన్‌షాట్స్ పంపితే మనీ క్రెడిట్ చేస్తామని నమ్మబలికాడు. తొలుత సింపుల్ టాస్క్‌లకు సరైన చెల్లింపులు జరపడతంతో స్కామర్‌ను రాజు గుడ్డిగా నమ్మాడు.
తన బ్యాంకు ఖాతా వివరాలన్నింటినీ స్కామర్‌కు పంపాడు. దీంతో స్కామర్ అనధికార లావాదేవీలకు పాల్పడి బాధితుడి ఖాతా నుంచి పెద్దమొత్తంలో నిధులను దారిమళ్లించాడు. మోసపోయినట్టు గుర్తించిన రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read More :
Viral news | భర్తతో కాపురం చేయలేనన్న కుమార్తె.. మేళతాళాలతో పుట్టింటికి తీసుకొచ్చుకున్న తండ్రి..!