న్యూఢిల్లీ : పోలీసులు, ప్రభుత్వం ప్రజల్లో సైబర్ నేరాలపై అవగాహన పెంచుతున్నా రోజురోజుకూ సైబర్ నేరగాళ్లు చెలరేగుతున్నారు. రూటు మార్చేస్తూ కేటుగాళ్లు కొత్త మార్గాల్లో ఆన్లైన్ అడ్డాగా అందినకాడికి దోచుకుంటున్నారు. లేటెస్ట్గా దేశ వాణిజ్య రాజధాని ముంబైలో స్కామర్లు రెచ్చిపోయారు.
లక్కీ డ్రాలో ఐఫోన్ (IPhone Scam) గెలుపొందారని మభ్యపెడుతూ ఓ వ్యక్తి నుంచి వీరు ఏకంగా రూ. 4.26 లక్షలు దండుకున్నారు. ముంబైకి చెందిన వ్యక్తికి (23) ఇటీవల లక్కీ డ్రాలో ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్ గెలుచుకున్నారని వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఎలక్ట్రానిక్స్ షాప్‌లో నిర్వహించిన లక్కీ డ్రాలో హాట్ డివైజ్ గెలుచుకున్నారని, మీ బహుమతి మీకు డెలివరీ చేశామని నిందితులు నమ్మబలికారు.
ఫర్నీచర్ షాపు యజమాని అయిన బాధితుడు వాట్సాప్ నెంబర్‌ను సంప్రదించగా ఐఫోన్‌ను పొందేందుకు పన్నులు చెల్లించాలని కోరారు. దీంతో దశలవారీగా స్కామర్లకు రూ. 4.26 లక్షలు చెల్లించారు. ఆపై ఎంతకీ ఐఫోన్ రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read More :