న్యూఢిల్లీ : నకిలీ జాబ్ వెబ్సైట్ ద్వారా ఉద్యోగాల పేరుతో ప్రజలను మోసగిస్తున్న రాకెట్‌ను ఢిల్లీ పోలీసులు రట్టు చేసి నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఘజియాబాద్ కేంద్రంగా జరుగుతున్న ఈ రాకెట్‌కు మురదానగర్కు చెందిన జానీ కుమార్‌ను ప్రధాన సూత్రదారిగా గుర్తించారు. కుమార్‌తో పాటు మరో ముగ్గురు అతడి అనుచరులు జాబిట్సొల్యూషన్స్.ఇన్ పేరుతో నకిలీ జాబ్ పోర్టల్‌ను నడిపిస్తున్నారు.
పలు జాబ్ వెబ్సైట్ల నుంచి బాధితుల ఫోన్ నెంబర్లతో వీరు డేటా సేకరిస్తారు. షేక్ బాబర్ అనే బాధితుడి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టగా నకిలీ వెబ్సైట్ బాగోతం వెల్లడైంది. నిందితుడి నుంచి తనకు నకిలీ జాబ్ మెసేజ్‌లు వచ్చాయని, నిందితుడు తనకు టెక్ట్స్ పంపి రూ 10 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరాడని బాబర్ అలీ చెప్పారు. రిజిస్ట్రేషన్ కాగానే తన ఖాతా నుంచి రూ 18,362 డెబిట్ అయ్యాయని బాధితుడు గుర్తించారు.
బాధితుడి ఫిర్యాదు ఆధారంగా రోహిణి సైబర్ సెల్ సాయంతో అనుమానితులను జల్లెడ పట్టారు. దర్యాప్తులో నిందితుడు ఘజియాబాద్‌లోని మురాద్‌నగర్ నుంచి ఈ రాకెట్ నడుపుతున్నట్టు గుర్తించారు. దాడులు చేపట్టిన పోలీసులు నిందితుడితో పాటు మరో ముగ్గురు అనురులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి డెబిట్ కార్డులు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు.