లోకల్ ట్రైన్లో పాడుపని : మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి దేహశుద్ధి!
కుటుంబ సభ్యులతో కలిసి లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తున్న మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిని అరెస్ట్ చేసిన ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో వెలుగుచూసింది.
ముంబై : కుటుంబ సభ్యులతో కలిసి లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తున్న మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిని అరెస్ట్ చేసిన ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో వెలుగుచూసింది. ఆగస్ట్ 7న హెచ్ఆర్ కన్సల్టెంట్‌గా పనిచేసే మహిళ తన భర్త, సోదరుడు, పిల్లలతో కలిసి దాదర్ వెళ్లి తిరుగుప్రయాణంలో సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో కళ్యాణ్ వద్ద లోకల్ ట్రైన్లో ఎక్కారు.
జనరల్ ట్రైన్ కంపార్టెమెంట్ రద్దీగా ఉండటంతో మహిళ భర్త, కూతురు ఎలాగోలా సీటులో కూర్చోగా మహిళ, ఆమె సోదరుడు వారికి దగ్గరగా నిలబడ్డారు. రైలు కంజూర్‌మార్గ్ వద్దకు రాగా వెనుక నిల్చున్న వ్యక్తి అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్టు గమనించిన మహిళ అతడిని చెంపదెబ్బ కొట్టారు. మహిళ భర్త, తోటి ప్రయాణీకులు కూడా నిందితుడికి దేహశుద్ధి చేశారు. నిందితుడిని బైకుల్లా ప్రాంతానికి చెందిన ఏఏ అన్సారీగా గుర్తించారు. థానే స్టేషన్లో నిందితుడిని దించి పోలీసులకు అప్పగించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- flashes
- local train
- MAN
- Woman
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

