లోన్ రికవరీ ఏజెంట్ల నిర్వాకం : మార్ఫింగ్ చేసిన నగ్న చిత్రాలు షేర్ చేయడంతో బలవన్మరణం!
లోన్ రికవరీ ఏజెంట్ల ఆగడాలు మితిమీరుతున్నాయి. ఇన్స్టంట్ లోన్ యాప్ రికవరీ ఏజెంట్లు మార్ఫింగ్ చేసిన తన నగ్న చిత్రాలను బంధువులు, స్నేహితులు, కొలీగ్స్కు పంపడంతో 38 ఏండ్ల వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటన ముంబైలోని మలద్లో బుధవారం వెలుగుచూసింది.
ముంబై : లోన్ రికవరీ ఏజెంట్ల ఆగడాలు మితిమీరుతున్నాయి. ఇన్స్టంట్ లోన్ యాప్ రికవరీ ఏజెంట్లు మార్ఫింగ్ చేసిన తన నగ్న చిత్రాలను బంధువులు, స్నేహితులు, కొలీగ్స్కు పంపడంతో 38 ఏండ్ల వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటన ముంబైలోని మలద్లో బుధవారం వెలుగుచూసింది.
ఆత్మహత్యకు ప్రేరేపించారని కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. తాను తీసుకోని రుణాన్ని చెల్లించాలంటూ మృతుడిని రికవరీ ఏజెంట్లు వేధించారని అతడి సోదరుడు వెల్లడించాడు. నిందితుడు వివిధ మొబైల్ నెంబర్ల నుంచి 50 సార్లు కాల్ చేసి రుణాన్ని తిరిగి చెల్లించాలని వేధింపులకు గురిచేశాడని ఆరోపించాడు.
దీంతో తమ సోదరుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో తీవ్ర నిర్ణయం తీసుకున్నాడని తెలిపాడు. ఏప్రిల్ 27న నిందితుడిపై తాము పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్య తీసుకోలేదని మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- agents
- loan recovery
- MAN
- Photos
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

