కుమ్రం భీం : జిల్లాలోని కౌటాల మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన కొసరి రాందాస్ నిన్న సాయంత్రం తాటిపల్లి నదిలో చేపలు ( Fishing ) పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందారు. సమాచారం అందుకున్న కౌటాల సీఐ సంతోష్, ఎస్సై సతీష్ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ బడిగే సంతోష్ సహకారంతో గాలింపు చర్యలు చేపట్టారు. కాగా గురువారం రాందాస్ మృతదేహాన్ని నది నుంచి బయటకు తీశారు. ప పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.