మరికల్ : మరికల్ మండల కేంద్రంలో టిప్పర్( Tipper ) , బైక్ ( Bike) ఢీకొన్న సంఘటనలో వ్యక్తి మృతి చెందిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ధన్వాడ మండలంలోని కంసాన్పల్లి గ్రామానికి చెందిన ఉప్పరి నారాయణ (45) మోటార్ సైకిల్ పై వెళ్తుండగా వేగంగా వచ్చి టిప్పర్ ఢీ కొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. నారాయణకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మరికల్ ఎస్సై రాము తెలిపారు .