మంగళవారం 26 జనవరి 2021
Crime - Nov 09, 2020 , 11:15:53

తండ్రి ఫోన్‌లో యాప్ ఇన్‌స్టాల్‌ చేపించి.. 9లక్షలు కొట్టేసిన సైబర్‌ నేరగాళ్లు

తండ్రి ఫోన్‌లో యాప్ ఇన్‌స్టాల్‌ చేపించి.. 9లక్షలు కొట్టేసిన  సైబర్‌ నేరగాళ్లు

ముంబై : డిజిట‌ల్ యాప్ పేరుతో 9 ల‌క్ష‌లు చోరీ చేసిన ఘ‌ట‌న మ‌హారాష్ర్ట‌లోని నాగ్‌‌పూర్‌లో చోటు చేసుకుంది. నాగ్‌పూర్‌లోని కొరాడికి చెందిన అశోక్ మ‌న్‌వాటే అనే వ్య‌క్తి ఖాతాలో రూ. 8.95 ల‌క్ష‌లు ఉన్నాయి. అయితే సైబ‌ర్ నేరగాళ్లు.. అత‌ని మొబైల్‌కు ఫోన్ చేసి.. తాము డిజిట‌ల్ పేమెంట్స్ కంపెనీ ప్ర‌తినిధుల‌మ‌ని చెప్పారు. క్రెడిట్ లిమిట్ మ‌రింత పెంచుతున్నామ‌ని, దాని కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాల‌ని సూచించారు. ఈ స‌మ‌యంలోఅశోక్ ఫోన్‌.. తన ప‌దిహేను సంవ‌త్స‌రాల కుమారుడి వ‌ద్ద ఉండ‌టంతో.. సైబ‌ర్ నేర‌గాళ్లు చెప్పిన‌ట్లు చేశాడు. డిజిట‌ల్ యాప్ డౌన్ లోడ్ చేసుకున్న త‌ర్వాత రిమోట్ సిస్టం ద్వారా అశోక్ ఖాతాలో ఉన్న రూ. 8.95 ల‌క్ష‌ల‌ను చోరీ చేశారు. కాసేప‌టికే రూ. 8.95 ల‌క్ష‌లు డెబిట్ అయిన‌ట్లు అశోక్ ఫోన్‌కు మేసేజ్ వ‌చ్చింది. దీంతో హుటాహుటిన బాధిత వ్య‌క్తి పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. 


logo