న్యూఢిల్లీ: చిరు తిండి అయిన ముంత మసాలాను ఉచితంగా ఇవ్వనందుకు వీధి వ్యాపారిని ఒక వ్యక్తి బండరాయితో కొట్టి హత్య చేశాడు. దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్‌లో ఈ దారుణం జరిగింది. బీహార్‌కు చెందిన రమేశ్ రామ్ ఒక వీధి వ్యాపారి. సైకిల్‌పై తిరుగుతూ ముంత మసాలా అమ్ముతుంటాడు. సోమవారం సాయంత్రం 5.30 గంటలకు గురుగ్రామ్‌లోని సెక్టార్ 65 ప్రాంతంలోని ఒక స్కూల్ సమీపంలో అతడు ఉండగా గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన 40 ఏండ్ల అజయ్ కుమార్ అక్కడకు వచ్చాడు. ఉచితంగా మసాలా ఇవ్వాలని అడిగాడు. రమేశ్ ఇవ్వనని చెప్పడంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
దీంతో వీధి వ్యాపారి రమేశ్ తన భార్యతో కలిసి సైకిల్‌పై ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు. అయితే వారిని వెంబడించిన అజయ్ సైకిల్ తొక్కుతున్న రమేశ్‌పైకి బండరాయి విసిరాడు. అది అతడి తలకు బలంగా తగలడంతో సైకిల్ వదిలి కింద పడి మరణించాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడైన అజయ్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. అతడిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.